Saturday, March 7, 2026

చేగుంట మండలం పులిమామిడి గ్రామపంచాయతీని డీఎల్పీఓ సందర్శన

చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో శనివారం నాడు డీఎల్పీఓ 99 రోజుల ప్రణాళికలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పాఠశాల, ఆంగన్‌వాడీ కేంద్రం, రహదారులు మరియు డ్రైనేజీ వ్యవస్థలను పరిశీలించారు.అదేవిధంగా పులిమామిడి గ్రామంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న మహిళా సమాఖ్య భవనం మరియు కిష్టాపూర్‌లో నిర్మిస్తున్న మహిళా సమాఖ్య భవనాన్ని సందర్శించి పనుల పురోగతిని ఆరా తీశారు.
ఈ సందర్భంగా గ్రామపంచాయతీకి సంబంధించిన రికార్డులను కూడా పరిశీలించారు. 99 రోజుల ప్రణాళిక అమలుపై సంబంధిత అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ సబితా, సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి, కిష్టాపూర్ సర్పంచ్ శ్రావణ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

ఏ 2 టీవీ న్యూస్ మార్చ్ 8,మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular