Thursday, July 2, 2026
Home Blog

మత్తు పదార్థాలను నియంత్రించాలి

0

మత్తు పదార్థాలను నియంత్రించాలి

– రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించొద్దు
– మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

ఏ2డిజిటల్ న్యూస్, జూన్ 12, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, రహదారి భద్రతా చర్యల సమర్థ అమలు, మత్తు పదార్థాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి రోడ్డు భద్రతా కమిటీ, మత్తు పదార్థాల నిర్మూలన కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించేందుకు ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి అవసరమైన హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్టులు వినియోగించాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.అదేవిధంగా జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువతలో మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచి, చట్టవిరుద్ధంగా మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలన అంశాల్లో ప్రతి శాఖ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ సమావేశంలో ఆర్ అండ్ బి ఈఈ వేణు, డీఎస్పీలు, జిల్లా రవాణా శాఖ అధికారి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు తదితర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

పులిమామిడిలో ఘనంగా గ్రామ సభవ్యర్థాల నిర్వహణపై అవగాహన

0

– గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం అవసరం : సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి

ఏ2డిజిటల్ న్యూస్, జూన్ 10, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పులిమామిడి గ్రామంలో బుధవారం గ్రామ సభ ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రామ సెక్రటరీ సబిత, ఉప సర్పంచ్ మద్దూరి రాజు, వార్డు సభ్యుడు మంగలి లక్ష్మణ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ సబిత మాట్లాడుతూ, 99 రోజుల ప్రణాళికలో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో “మన వ్యర్థాల నిర్వహణ” నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి గ్రామ పంచాయతీకి అందించాలని సూచించారు. అలాగే పూర్వకాలంలో ఉపయోగించిన ఇస్తరాకులతో భోజనం చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు.సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ ప్రజల సమస్యలు, అభిప్రాయాలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే గ్రామ సభల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.గ్రామాభివృద్ధి, పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, స్వచ్ఛమైన పులిమామిడి గ్రామ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, ప్రజా భాగస్వామ్యంపై నిర్వహించిన ఈ గ్రామ సభ విజయవంతంగా ముగిసింది.

గాంధీనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్

0

ప్రజా-పోలీసు సంబంధాల బలోపేతానికి కమ్యూనిటీ పోలీసింగ్

సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్

45 వాహనాలు తాత్కాలిక సీజ్ – సైబర్ నేరాలు, పోక్సో చట్టంపై అవగాహన

ఏ2 డిజిటల్ న్యూస్, జూన్ 10, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడం, నేరాల నియంత్రణ లక్ష్యంగా మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్‌ను నిర్వహించారు. మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 70 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని 45 వాహనాలను తాత్కాలికంగా సీజ్ చేశారు. సంబంధిత వాహన యజమానులు అవసరమైన పత్రాలను సమర్పించి తమ వాహనాలను తీసుకెళ్లాలని పోలీసులు సూచించారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, నేరాల నిర్మూలన, ప్రజల రక్షణ, భద్రతాభావం కల్పించడంలో భాగంగానే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు లేదా నేరచరిత్ర కలిగిన వ్యక్తులు ఆశ్రయం పొందుతున్నారా అనే విషయాలను గుర్తించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.ఇళ్లను అద్దెకు ఇచ్చే యజమానులు అద్దెదారుల పూర్తి వివరాలను సేకరించడంతో పాటు ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారనే నమ్మకాన్ని పెంపొందించడం, ప్రజా-పోలీసు సంబంధాలను మరింత బలోపేతం చేయడమే కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా డిజిటల్ అరెస్ట్, ఫోన్ కాల్ బ్లాక్‌మెయిల్, ఓటీపీ మోసాలు, పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలు, ఫేక్ లింకుల ద్వారా జరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద కాల్స్, సందేశాలకు స్పందించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.తనిఖీల సందర్భంగా ‘జూబి’ స్నిఫర్ డాగ్‌తో పాటు పోర్టబుల్ ఫింగర్‌ప్రింట్ పరికరాలను వినియోగించినట్లు అదనపు ఎస్పీ తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడం, వారి వివరాలను ధృవీకరించడం, నేరస్తులను గుర్తించడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తున్నామని చెప్పారు.అలాగే 18 సంవత్సరాలు నిండని బాలికను వివాహం చేసుకోవడం, ఆమె అంగీకారం తెలిపినా చట్టం దృష్టిలో అది తీవ్రమైన నేరమేనని స్పష్టం చేశారు. ప్రేమ పేరుతో మైనర్ బాలికను తీసుకువెళ్లడం, ప్రలోభపెట్టడం వంటి చర్యలు కూడా తీవ్రమైన నేరాల కింద పరిగణించబడతాయని హెచ్చరించారు. బాలల రక్షణ కోసం పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.వాహనాల కొనుగోలు సమయంలో అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని, ఆర్సీని తప్పనిసరిగా తమ పేరుపై బదిలీ చేసుకోవాలని సూచించారు. వాహనంపై ఫైనాన్స్ లేదా ఇతర బకాయిలు ఉన్నాయో లేదో నిర్ధారించుకున్న తర్వాతే కొనుగోలు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు మహేష్, రాజశేఖర్ రెడ్డి, జార్జ్, ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

0

జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆదేశం

ఏ2డిజిటల్ న్యూస్, జూన్ 8, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన అర్జీలను సంబంధిత అధికారులు తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆదేశించారు.సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించారు. కార్యక్రమంలో మొత్తం 94 దరఖాస్తులు స్వీకరించారు. వాటిలో పెన్షన్లకు సంబంధించినవి 15, భూభారతి 24, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినవి 15, ఇతర సమస్యలకు సంబంధించినవి 40 ఉన్నాయి.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ, ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాలకు వస్తున్నందున వారి వినతులను అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించి న్యాయం చేయాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా ప్రతి దరఖాస్తుపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

ఈవీఎం గోదాంను త్రైమాసికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

0

ఏ2 డిజిటల్ న్యూస్, జూన్ 8, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు) గోదాంను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సోమవారం త్రైమాసిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జరిగాయి.తనిఖీ సందర్భంగా గోదాం సీల్స్‌ను పరిశీలించిన కలెక్టర్, అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, అగ్నిప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసిన ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, ఇతర భద్రతా పరికరాలను పరిశీలించారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో అనుసరించాల్సిన భద్రతా చర్యలపై సంబంధిత సిబ్బందికి సూచనలు జారీ చేశారు.గోదాం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు, భద్రతా రిజిస్టర్లు, సందర్శకుల నమోదు పుస్తకాలను పరిశీలించిన కలెక్టర్, ఈవీఎంల భద్రత విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని భద్రతా సిబ్బందిని ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిరంతరం ఈవీఎం గోదాం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈవీఎంల భద్రత విషయంలో ఎటువంటి రాజీ లేకుండా 24 గంటలపాటు పకడ్బందీ భద్రతా ప్రమాణాలు అమలు చేస్తున్నామని, గోదాంలోని భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ గఫార్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మెదక్ సర్కిల్ పరిధిలో బెల్ట్ షాపులకు మద్దతిస్తున్న ఎవరా అధికారి..?

0

–నెలకు లక్షలాది రూపాయలు దండుకుంటున్నా వైనం

ఏ2డిజిటల్ న్యూస్, జూన్ 7, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ ఆబ్కారీ సర్కిల్ పరిధిలోని మెదక్ రూరల్, హవేలి ఘనపూర్, పాపన్నపేట, కొల్చారం మండలాల వ్యాప్తంగా ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్న విధంగా అక్రమ బెల్ట్ షాపులకు మద్దతిస్తున్న ఆబ్కారీ శాఖ సిఐ నాగేశ్వరరావు వివరాల్లోకి వెళితే పెద్ద గ్రామాలు మొదలుకొని చిన్న గ్రామాలు వరకు ఒక్కొక్క గ్రామంలో మూడు నుంచి ఐదు వరకు బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి ఇది ఇలా ఉండగా మధిర గ్రామాల్లో రెండు చొప్పున గిరిజన తండాలలో సైతం రెండు నుంచి నాలుగు వరకు అక్రమ బెల్ట్ షాపుల ఇష్టారీతిగా నడుస్తున్న వైనం నెలకొంది ఈ అక్రమ మద్యం షాపుల్లో ఉదయం 5 గంటల నుండి రాత్రి ఒంటిగంట వరకు మద్యం విచ్చలవిడిగా అమ్మకాలు కొనసాగుతుండడం విశేషం అయినప్పటికీ ఆబ్కారీ శాఖకు చెందిన ఎస్ఐల పర్యవేక్షణ లేకపోవడం ఆయా గ్రామాల్లో తనిఖీలు చేపట్టక పోవడానికి వారికి అందుతున్న నెలనెలా లేదా మూడు నెలలకు ఒకసారి అందుతున్న ముడుపులేనా? ఇటీవల ఒక మండలంలోని ఒక గ్రామంలో వైన్స్ ఉన్నా కూడా అక్రమ బెల్ట్ షాపు వద్దకు వెళ్లి మీడియా ప్రతినిధి ప్రశ్నించగా సదరు ఆబ్కారీ శాఖకు మామూలు ఇస్తున్నట్లుగా మహిళా వ్యాపారురాలు ముఖాముఖిగా ముడుపులు ఇస్తున్నట్టుగా బహటంగా తెలపడం ఆప్కారి శాఖ అవినీతికి నిదర్శనం ఇది ఇలా ఉండగా రాత్రి 10 గంటల సమయంలో ప్రభుత్వ నిబంధనల మేరకు మద్యం షాపులు మూసి వేయడం జరుగుతుంది. 10 గంటల తరువాత వచ్చిన మద్యం ప్రియులు వైన్ షాపులు మూసి ఉండడంతో బెల్టు షాపులను ఆశ్రయించి ఒక బీరు బాటిల్ పైన దాదాపు 30 రూపాయల నుండి 50 రూపాయల, ఒక క్వాటర్ బాటిల్ పై 50 రూపాలు అదనంగా చెల్లించి కొనుగోలు చేస్తూ విందులు వినోదాలతో మద్యం సేవిస్తూ తెల్లవారి వరకు అనగా 12 నుంచి రెండు గంటల సమయంలో మద్యం అధిక ధరలకు తీసుకొని మద్యం మత్తులో ఇంటికి వెళ్లాలని ఆత్రుతతో ప్రధాన రహదారుల పైకి వచ్చి అతివేగంగా బైకులు కార్లు నడపడంతో ఎదురుగా వస్తున్న బైకులు కార్లకు ఢీ కొట్టి వారి ప్రాణాలనే కాకుండా మద్యం సేవించకుండా వెళుతున్న వారి ప్రాణాలు సైతం హరి అంటున్నాయి ఇటువంటి సందర్భాలు జిల్లావ్యాప్తంగా ఎన్నో జరిగినాయి వారి కుటుంబాలు అధోగతి పాలవుతున్నాయి ఇదంతటికి కారణం అక్రమ బెల్ట్ షాపుల నిర్వాకం అనేది క్లుప్తంగా తెలుస్తుంది ఇంత జరుగుతున్నా చోద్యం చూస్తున్న ఎస్ఐలపై సీఐపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం సూపరిండెంట్ కు ఎంతైనా ఉంది చర్యలు తీసుకుని ఎడల కల్తీ కళ్ళు పై వారు వ్యవహరిస్తున్న తీరుపై రెండో కథనం మీ ఏ2టీవీ న్యూస్ ఛానల్లో త్వరలో…

ప్రకృతి పరిరక్షణకు బర్డ్ వాక్ కార్యక్రమం: అదనపు కలెక్టర్ నగేష్

0

ఏ2డిజిటల్ న్యూస్, జూన్ 6, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

ప్రకృతి పరిరక్షణ, పక్షుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పోచారంలోని డిబిసిలో శనివారం బర్డ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు.డీఎఫ్ఓ జోజి ఆధ్వర్యంలో అటవీ శాఖ సిబ్బంది నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ నగేష్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో మెదక్ డీపీఆర్‌ఓ రామచంద్రరాజుతో కలిసి ఆయన నాలుగు కిలోమీటర్ల బర్డ్ వాక్‌లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అటవీ వారోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా బర్డ్ వాక్ నిర్వహించామని తెలిపారు. పోచారం ప్రాంతం పక్షి వైవిధ్యం, సహజ వారసత్వానికి నిలయమని పేర్కొన్నారు. పోచారం జలాశయం, అభయారణ్యం పరిసర ప్రాంతాలు వలస నీటి పక్షులు, కొంగలు, ఐబిస్‌లు, బాతులు తదితర అనేక రకాల పక్షులకు ఆవాసంగా ఉన్నాయని చెప్పారు.పక్షుల జీవన విధానం, వలస పక్షుల ప్రాముఖ్యత, పర్యావరణ సమతుల్యతలో వాటి పాత్రపై ప్రజలకు అవగాహన కల్పించడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు. పక్షుల సంరక్షణ కోసం చెట్లు నాటడం, నీటి వనరులను కాపాడడం, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు.ప్రకృతిని ఆస్వాదిస్తూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు బర్డ్ వాక్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఓలు, బీట్ ఆఫీసర్లు, అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాం.. సర్పంచ్ స్వప్న ఉషయ్య

0

సిసి రోడ్లు పనులు ప్రారంభించిన సర్పంచ్ స్వప్న ఉషయ్య, ఉప సర్పంచ్ నిర్మల శేఖర్ యాదవ్

ఏ2డిజిటల్ న్యూస్, జూన్ 6,సీనియర్ జర్నలిస్ట్ (బుచ్చన్న)

కొల్చారం( 5)మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. సిసి రోడ్డు నిర్మాణం పనుల కొరకు ఎంపీ నిధుల నుండి పది లక్షల రూపాయలు మంజూరు అయినవి అని గ్రామ సర్పంచ్ స్వప్న ఊష య్య తెలిపారు.గ్రామ అభివృద్ధిలో భాగంగా ఒకటవ వార్డు, పదవ వార్డులలో నూతనంగా చేపట్టనున్న 250 మీటర్ల సిసి రోడ్డు నిర్మాణ పనులు శుక్రవారం గ్రామ సర్పంచ్ స్వప్న ఊష య్య ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలపడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రజల సౌకర్యార్థం రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, గ్రామ సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. నాణ్యత ప్రమాణాలతో ఈ రోడ్డు పనులను గడువులోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ నిధుల నుండి మంజూరు చేయించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు పనులు ప్రారంభం కావడం పట్ల వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చందాపురం నిర్మల శేఖర్ యాదవ్ , మాజీ సర్పంచ్ తిరునగరి గోదావరి,వెంకటరాములు ,పంచాయతీ సెక్రెటరీ మమత, వార్డు మెంబర్స్ అక్కిం ప్రవీణ్ యాదవ్, తోశ నవీన్, పసుల రేఖ యాదగిరి, నాయకులు ఎంచర్ల శేఖర్ యాదవ్,ఎంబరి శేఖర్ వడ్ల సంతోష్ కుమార్ గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.

రంగంపేట గ్రామ పంచాయతీ వాటర్ మెన్ అనారోగ్యంతో మృతి

0

ఏ2డిజిటల్ న్యూస్, జూన్ 6,సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న )

కొల్చారం( 5) మండలంలోని రంగంపేట గ్రామపంచాయతీలో గత 30 సంవత్సరాలకు పైగా వాటర్ మెన్ గా పని చేస్తూ ప్రజలకు ఎనలేని సేవలు చేసిన వ్యక్తిగా మంచి పేరు సాధించిన పంచాయితీ కార్మికుడు బాలమ్మోల్ల(కొనింటి )వెంకటేశం అనారోగ్యంతో ఆసుపత్రిలో మృతి చెందడంతో రంగంపేట గ్రామంలో పూర్తిస్థాయిలో విషాద ఛాయలు అలుము కొన్నాయి. గ్రామంలో ప్రతి ఇంటి వారితో ఎంతో సమయమనంగా ఉంటూ ప్రతి ఒక్క ఇంటికి సేవ చేసిన వ్యక్తిగా పలకరింపులు ఆప్యాయత, అనురాగం చిరునవ్వుతో పనిచేసే వ్యక్తిత్వం గల వాటర్ మెన్ అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ప్రజలుశోకసంద్రంలో మునిగారు. 30 సంవత్సరాలుగా వాటర్ మెన్ గా ఒకే వ్యక్తి చేయడమనేది జిల్లాలో కూడా 30 సంవత్సరాలు చేసిన వారు ఎవరు కూడా లేదనేది ముమ్మాటికి నిజం అతను చేసిన సేవకు ప్రతి కుటుంబాల వారు నివాళు లు శ్రద్ధాంజలి ఘటిస్తూ కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అరిగే స్వర్ణలత విజయ్ కుమార్ వారి కుటుంబానికి తీరని లోటు జరిగిందని వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు అంతేకాకుండా అతని కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. గ్రామానికి సేవ చేసే ఇలాంటి మంచి వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని వారన్నారు.

రైతుల సమస్యలపై స్పందించిన ఎస్పీ

0

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి సమస్యలపై ఆరా

లారీలు, టార్పాలిన్ల ఏర్పాటుకు అధికారులకు ఆదేశాలు

ఏ2 డిజిటల్ న్యూస్, జూన్ 5, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టేందుకు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు శుక్రవారం మెదక్ పట్టణంలోని దయరా పరిధిలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్నకుమార్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సందీప్‌రెడ్డి, ఎస్‌ఐ నారాయణలతో కలిసి కొనుగోలు కేంద్రంలోని పరిస్థితులను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని వాటిపై ఆరా తీశారు.ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించేందుకు తగిన సంఖ్యలో లారీలు అందుబాటులో లేకపోవడంతో కొనుగోలు ప్రక్రియ ఆలస్యమవుతోందని రైతులు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు బ్లాక్ టార్పాలిన్లు అత్యవసరమని కోరారు.రైతుల సమస్యలపై వెంటనే స్పందించిన ఎస్పీ, జిల్లా అదనపు కలెక్టర్ నగేష్తో ఫోన్‌లో మాట్లాడి అవసరమైన టార్పాలిన్లు, ఇతర సౌకర్యాలను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. దీనికి స్పందించిన అదనపు కలెక్టర్ రైతులకు అవసరమైన ఏర్పాట్లు వెంటనే చేస్తామని హామీ ఇచ్చారు.ధాన్యం రవాణాకు అవసరమైన లారీల కొరతపై కూడా ఎస్పీ స్పందిస్తూ సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని రైతులకు తగిన సంఖ్యలో లారీలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని డీఎస్పీ ప్రసన్నకుమార్‌ను ఆదేశించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, సమస్యల పరిష్కారంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. రైతుల సంక్షేమానికి జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని, రైతుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగంతో కలిసి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు.