Wednesday, May 6, 2026

కౌడిపల్లి పోలీస్ స్టేషన్‌లో మహిళా దినోత్సవ వేడుకలు..

ఏ 2 టీవీ న్యూస్ మార్చి 8, మెదక్ జిల్లా ప్రతినిధి:

మెదక్ జిల్లా కౌడిపల్లి పోలీస్ స్టేషన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ హాజరై కేక్ కట్ చేసి మహిళా పోలీస్ సిబ్బందితో కలిసి మహిళా దినోత్సవ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. పోలీస్ శాఖలో మహిళా సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు భద్రత కల్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. కఠిన పరిస్థితుల్లో కూడా మహిళా పోలీసులు ధైర్యంగా విధులు నిర్వర్తిస్తూ శాఖకు మంచి పేరు తీసుకొస్తున్నారని ప్రశంసించారు. అలాగే మహిళా సిబ్బంది విధుల్లో ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్న మహిళా సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డియస్పి నరేందర్ గౌడ్, నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి, కౌడిపల్లి ఎస్సై అమర్, పోలీస్ సిబ్బంది, మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular