జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆదేశం
ఏ2డిజిటల్ న్యూస్, జూన్ 8, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన అర్జీలను సంబంధిత అధికారులు తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆదేశించారు.సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించారు. కార్యక్రమంలో మొత్తం 94 దరఖాస్తులు స్వీకరించారు. వాటిలో పెన్షన్లకు సంబంధించినవి 15, భూభారతి 24, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినవి 15, ఇతర సమస్యలకు సంబంధించినవి 40 ఉన్నాయి.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ, ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాలకు వస్తున్నందున వారి వినతులను అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించి న్యాయం చేయాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా ప్రతి దరఖాస్తుపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

