ఏ 2 టీవీ న్యూస్ మార్చి 9, కుల్చారం ప్రతినిధి పద్మ బిక్షపతి
మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని అప్పాజీపల్లి గ్రామంలో పంట యాప్ నమోదు పనితీరును జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అభివృద్ధి అధికారి శ్వేతాకుమారి నిర్వహిస్తున్న పంట నమోదు ప్రక్రియను కలెక్టర్ తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ పంట పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు.ఈ సందర్భంగా రైతులు కలెక్టర్‌కు తమ సమస్యలను వివరించారు. యూరియా బస్తాపై ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే రూ.30 నుంచి రూ.40 వరకు అదనంగా వసూలు చేస్తూ విక్రయాలు చేస్తున్నారని రంగంపేట, యనగండ్ల తదితర గ్రామాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్ ప్రతిమా సింగ్‌కు రైతులు ఫిర్యాదు చేశారు.రైతుల ఫిర్యాదును గమనించిన కలెక్టర్ ప్రతిమా సింగ్, దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

