Saturday, May 9, 2026

ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం ఆలోచన చేయాలి – మహిళా సంఘ భవనాన్ని వేరే చోట నిర్మించాలని గ్రామస్తుల వినతి.

ఏ 2 టీవీ న్యూస్ మార్చి 9, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం ఆలోచన చేస్తూ మహిళా సంఘం భవనాన్ని వేరే చోట నిర్మించాలని మండలంలోని పైతర గ్రామస్తులు జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల మంజూరైన మహిళా సంఘం భవన నిర్మాణానికి తాము అడ్డు కాదని, నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి అణువుగా ఉన్న ఖాళీ స్థలంలో మహిళా సంఘం భవనం నిర్మించడం ఫ్యూచర్ డెవలప్మెంట్ కు ఇబ్బందికరంగా ఉంటుందని డిపిఓ దృష్టికి తీసుకువెళ్ళారు. ప్రస్తుతం ఉన్న పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరుకుంటుందని దాంతోపాటు పక్కనే ఉన్న ఖాళీ స్థలంను కలుపుకొని నూతన పంచాయతీ భవనం నిర్మిస్తే బాగుంటుందని తెలిపారు. అందుకు సానుకూలంగా స్పందించిన డిపిఓ యాదయ్య కొల్చారం ఎంపీడీవో రఫీ ఉన్నీసా బేగం కు ఫోన్ చేసి ఫ్యూచర్ భవన నిర్మాణాల కోసం ఆలోచన చేస్తూ గ్రామసభ ద్వారానే పనులు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. గ్రామసభలు లేకుండా పనులు ఎట్లా చేపడుతారని పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు చూపుతోనే గత ప్రభుత్వ హయాంలో గ్రామపంచాయతీ భవనాలు ఇరుకు గదులుగా ఉండకూడదన్న సంకల్పంతో దాదాపు రూ.13 లక్షల వ్యాయంతో నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం తో పాటు మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా విశాలంగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని గ్రామాస్థులు గుర్తు చేశారు. అప్పట్లో కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వల్ల పనులు చేపట్ట లేకపోయారని, ప్రస్తుతం ఉన్న పంచాయతీ భవనంలోనే పాలన కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం గ్రామపంచాయతీ కార్యాలయం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఇరుకుగా మహిళా సంఘం భవనం నిర్మించడం సరైనది కాదని, వేరే చోట నిర్మించేందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రణాళికలు తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కుమ్మరి భూమయ్య, బోయిని అంతయ్య, బట్ట స్వామి, పుట్టి శివ, మరెళ్లి ప్రభాకర్, ఆకుల కార్తీకరాజు, మాడబోయిన శేఖర్, సాయికుమార్ తదితరులు ఉన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular