Wednesday, May 6, 2026

చెల్మెకుంట అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం.

ఏడుపాయల సమీపంలో ఘటన – గుర్తు తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి

ఏ 2 టీవీ న్యూస్ మార్చి 10 మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

ఏడుపాయల సమీపంలోని చెల్మెకుంట వద్ద గల అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.మహిళ వయస్సు సుమారు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతురాలి వివరాలు ఇప్పటివరకు తెలియరాలేదు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, మృతురాలి గురించి ఎవరికైనా సమాచారం ఉంటే పాపన్నపేట ఎస్‌ఐ గారికి తెలియజేయాలని కోరుతున్నారు.సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 8712657920.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular