ఏ 2 టీవీ న్యూస్ మార్చి 10 మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
కొల్చారం మండల తహసీల్దార్ శ్రీనివాసాచారి గ్రామపంచాయతీ కార్యాలయానికి మొట్టమొదటిసారిగా విచ్చేయగా, గ్రామ సర్పంచ్ పాతురి దయాకర్ గౌడ్, ఉప సర్పంచ్ మరియు గ్రామ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నూతన గ్రామ సర్పంచ్ పాతురి దయాకర్ గౌడ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ శ్రీనివాసాచారిని శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. గ్రామాభివృద్ధికి అధికారులు సహకరించాలని కోరుతూ గ్రామ సమస్యలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

