Wednesday, May 6, 2026

కుల్చారం మండలంలో భద్రత పెంపు…32 సీసీ కెమెరాల ప్రారంభం.

ఏ2టీవీ న్యూస్, మార్చి11,మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కుల్చారం మండలంలో కీలక చర్యలు చేపట్టారు. ఏడుపాయల టీ జంక్షన్ నుండి రెండవ బ్రిడ్జ్ వరకు మొత్తం 32 కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలను ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ప్రారంభించారు. ఈ కెమెరాల ద్వారా వాహనాల రాకపోకలు, ప్రజల కదలికలను నిరంతరం పర్యవేక్షించే అవకాశం కలుగుతుంది. అలాగే అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాలను సులభంగా గుర్తించే విధంగా పోలీసులకు సహాయపడతాయి. నేరాలను నిరోధించడం, గుర్తించడం మరియు చట్టం-సువ్యవస్థను కాపాడడంలో ఈ సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించనున్నాయి. నేరాల దర్యాప్తు మరియు విచారణలో కూడా పోలీసులకు ఇవి ఎంతో ఉపయోగపడనున్నాయి. ఈ సందర్భంగా ప్రజలు కూడా పోలీసులకు సహకరించి శాంతి భద్రతలను కాపాడటంలో భాగస్వాములు కావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular