ఏ2టీవీ న్యూస్, మార్చి12, మెదక్ జిల్లా ప్రతినిధి(రాము)




మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో 99వ ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా బుధవారం గ్రామంలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.గ్రామ సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జెసిబి యంత్రంతో గ్రామంలోని రోడ్లను శుభ్రపరచడంతో పాటు మురికికాలువలను కూడా శుభ్రం చేయించారు.గ్రామంలో పరిశుభ్రతను కాపాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ సెక్రెటరీ సబిత, సర్పంచ్ రావి పల్లి శ్రీనివాస్ రెడ్డి తో పాటు వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

