ఏ2టీవీ న్యూస్, మార్చ్12, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లాలో నిర్వహిస్తున్న పోలీసు క్రీడా పోటీల్లో మూడవ రోజు ఉత్కంఠభరితంగా కొనసాగింది. కార్యక్రమంలో భాగంగా మెదక్‌లోని వేస్లీ కళాశాల మైదానంలో డీపీవో మెదక్ మరియు డిఏఆర్ మెదక్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ గురువారం ప్రారంభమైంది.మూడు రోజులుగా జరుగుతున్న ఈ పోలీసు క్రీడా పోటీలకు సిబ్బంది నుంచి మంచి స్పందన లభించింది. ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, క్రీడలు సిబ్బందిలో ఐక్యతను పెంపొందించడమే కాకుండా ఆరోగ్య పరిరక్షణకు కూడా ఎంతో దోహదపడతాయని తెలిపారు. విధుల్లో ఉండే ఒత్తిడిని తగ్గించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.మొత్తానికి పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్న ఈ క్రీడా పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.

