జిల్లాలో హాజరు శాతం 96.71 – ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి.
ఏ2టీవీ న్యూస్, మార్చ్12, మెదక్ జిల్లా ప్రతినిధి(రాము)
జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పరీక్షలు పదకొండవ రోజు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి తెలిపారు. ఈరోజు జరిగిన రెండవ సంవత్సరం కెమిస్ట్రీ–I, కామర్స్–I పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా జరిగాయని వెల్లడించారు.మొదటి సంవత్సరం పరీక్షల్లో జనరల్ విభాగంలో మొత్తం 6085 మంది విద్యార్థుల్లో 5895 మంది పరీక్షకు హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 279 మందిలో 260 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. జిల్లాలో పదకొండవ రోజు మొత్తం హాజరు శాతం 96.71 శాతంగా నమోదైనట్లు తెలిపారు.ఈరోజుతో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ సంవత్సరం అమలులో ఉన్న ఐదు నిమిషాల నిబంధన కారణంగా విద్యార్థులందరూ సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకుని పరీక్షలు రాశారని చెప్పారు.జిల్లాలోని వివిధ పరీక్షా కేంద్రాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం పర్యవేక్షించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

