Wednesday, May 6, 2026

నర్సాపూర్ లో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఏ2టీవీ న్యూస్, మార్చి 14, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో శనివారం జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు శాఖమూరి యాదగిరి, కృష్ణవేణి లు జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సహకారంతో జిల్లాలో పార్టీని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదుకు సైతం అపూర్వ స్పందన లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజయ్, లక్ష్మి, కుమార్, గోపి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular