ఏ2టీవీ న్యూస్, మార్చి 14, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)


మెదక్ జిల్లా కొల్చారం మండలం రాంపూర్ సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను హవేలీఘనపూర్ మండలం బూర్గుపల్లికి చెందిన తండ్రి, కొడుకులు అమృత్ గౌడ్ (51), రిషివర్ధన్ గౌడ్ (13)గా, అలాగే భూపతిపూర్‌కు చెందిన సాయి గౌడ్ (32)గా పోలీసులు గుర్తించారు. వీరు కొల్చారం మండలం రంగంపేటలో జరిగిన శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

