Wednesday, May 6, 2026

పులిమామిడిలో ముమ్మరంగా ప్రజాపాలన కార్యక్రమం

ఏ2టీవీ న్యూస్, మార్చి 15,మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలనలో భాగంగా చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి పారిశుద్ధం తదితర పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గ్రామంలో ఎనిమిది వార్డుల గాను ఇప్పటివరకు జెసిబిలతో గుంతలను పూడ్చి రోడ్లు బాగు చేసి పిచ్చి పొదలను తొలగించి గ్రామంలో గల పరిసరాలను శుభ్రపరచారు. ఈ సందర్భంగా సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధి అని గ్రామంలోని పరిసరాల పరిశుభ్రతకు, అభివృద్ధికి ప్రజలు తమ వంతు బాధ్యతగా సహకరించాలని కోరారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular