Wednesday, May 6, 2026

పోడ్చన్‌పల్లి తండా వద్ద బొమ్మ బొరుసు ఆడుతున్న 10 మంది కేసు నమోదు

20,040 నగదు, 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం – మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

ఏ2టీవీ న్యూస్, మార్చి15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం పోడ్చన్‌పల్లి తండా సమీపంలో బొమ్మా బొరుసు ఆడుతున్న 10 మందిని పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించగా, కొంతమంది వ్యక్తులు జూదం ఆడుతున్నట్లు గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో మదారి లింగం, జుకంటి బాబు, జిలకర సాయిలు, వడ్డే సాయిలు, బుచ్చం రాజు, షేక్ రఫీ, గోవింద్ ఆంజనేయులు, తాడేపు సంతోష్, బోడ వినోద్, కొమ్ముల అనిల్ ఉన్నారు. వారి వద్ద నుంచి ₹20,040 నగదు మరియు 10 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పాపన్నపేట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, జూదాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జూదం కారణంగా కుటుంబాలు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు సమాజంలో చెడు ప్రభావం పడుతుందని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా జూదం నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని ప్రజలను కోరారు. అక్రమ కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తారని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular