Wednesday, May 6, 2026

పులిమామిడిలో గ్రామ పంచాయతీ కార్మికులకు ఘన సన్మానం

ఏ2టీవీ న్యూస్ మార్చి16, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో ఆదివారం నాడు గ్రామ పంచాయతీ కార్మికుల సేవలను గుర్తించి వారిని ఘనంగా సన్మానించారు. గ్రామ పరిశుభ్రత కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్మికుల పట్ల పాలకవర్గం కృతజ్ఞత చాటుకుంది. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్మికులకు శాలువాలు కప్పి గౌరవించారు. కేవలం సన్మానంతోనే కాకుండా, వారి ఆరోగ్యం మరియు అవసరాలను దృష్టిలో ఉంచుకుని, నిత్యవసర సరుకులు, వంట నూనెలు, సబ్బులు, మాస్కులు, మరియు గ్లౌజులు అందజేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సబితా, గ్రామ సర్పంచ్ రావుపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ మద్దూరి రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కార్మికుల పాత్ర వెలకట్టలేనిదని వారు ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మంగలి లక్ష్మణ్, అబ్రమైన యశోద, గొర్రె శ్రీహరి, గొర్రె ఎల్లవ్వ, బండ్ల వేణు, తొయేటి కృష్ణ, కొమ్ము కవిత తదితరులు పాల్గొని కార్మికులకు తమ మద్దతును తెలిపారు. గ్రామ అభివృద్ధిలో కార్మికుల శ్రమను గుర్తించి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular