Wednesday, May 6, 2026

పేదలకు డబుల్ బెడ్ రూములు పంపిణీ చేయాలి: జనసేన పార్టీ నాయకులు శాఖమూరి యాదగిరి

ఏ2టీవీ న్యూస్,మార్చి16, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

నర్సాపూర్ లో బిఆర్ఎస్ హయాంలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూంలు ఇప్పటికీ వృధాగా పడి ఉన్నాయని, వాటిని వెంటనే పేదలకు పంపిణీ చేయాలని నర్సాపూర్ జనసేన పార్టీ నాయకులు శాఖమూరి యాదగిరి స్థానిక ఆర్డిఓ రామకృష్ణకు వినతి పత్రం సమర్పించారు. అప్పటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం పేదలకు సొంతింటి కల నిజం చేయాలన్న సంకల్పంతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించిందని అవి ఇప్పటికీ వృధాగానే పడి ఉన్నాయని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అర్హులైన పేదలను గుర్తించి తక్షణమే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నవీన్, మణిదీప్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular