ఏ2టీవీ న్యూస్, మార్చి17, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
ప్రత్యేక రాష్ట్రము కోసం అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125 వ జయంతి సందర్బంగా హైదరాబాద్ కు చెందిన భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ నిత్య ప్రయోగ శీలి, సినీ దర్శకుడు డా. పీసీ ఆదిత్య కు ప్రతిష్టత్మాక పొట్టి శ్రీరాములు స్మారక పురస్కారం అందజేశారు. ఈ సందర్బంగా సంస్థ నిర్వాకులు దాసరి మహేష్ మాట్లాడుతూ గత 30సంవత్సరాలనుండి సినీ రంగం లో ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఎందరో కొత్త వారికి అవకాశాలు ఇస్తున్న దర్శకుడు పీసీ ఆదిత్య కు ఈ అవార్డు ఇవ్వడం మా సంస్థ కు గర్వం గా ఉందన్నారు. అవార్డు గ్రహీత డా. పీసీ ఆదిత్య స్పందిస్తూ అమరజీవి అవార్డు అందుకోవడం సంతోషం గా ఉందనీ, భవిష్యత్ లో పొట్టి శ్రీరాములు జీవిత విశేషాలు తో ఓ డాకుమెంటరీ ఫిల్మ్ తీస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆదిత్య అభిమానులు మిత్రులు అభినందనలు తెలిపారు.

