ఏ2టీవీ న్యూస్, మార్చి18, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా కేంద్రంలోని భరోసా సెంటర్‌కు ప్లాన్ ఇండియా ఎన్‌జీఓ 200 మెడికల్ కిట్లను అందజేసింది. ఈ కార్యక్రమం అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ సమక్షంలో జరిగింది.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మహేందర్ భరోసా సెంటర్‌ను సందర్శించి, రికార్డులు, సిబ్బంది పనితీరు, పోక్సో కేసుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. లైంగిక వేధింపుల బాధితులకు భరోసా సెంటర్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు.బాధితులకు తక్షణ వైద్య, న్యాయ సహాయం అందించడంతో పాటు మానసిక ధైర్యం కల్పించాలని సిబ్బందికి సూచించారు. మహిళలు, పిల్లల రక్షణ కోసం కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయని పేర్కొన్నారు.ప్లాన్ ఇండియా అందజేసిన ఈ మెడికల్ కిట్లు వైద్య పరీక్షల్లో ఎంతో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. ఈ సహకారం అందించిన ఎన్‌జీఓకు భరోసా సెంటర్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో భరోసా కోఆర్డినేటర్ సౌమ్య, ప్లాన్ ఇండియా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

