ఏ2టీవీ న్యూస్, మార్చి 21, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
నలుగురు అరెస్ట్ – ఇద్దరు పరారీలోరూ.4,750 నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనంమెదక్ జిల్లా చిల్పిచేడ్ మండలం సిలంపల్లి గ్రామ శివారులో అక్రమంగా జూదం నిర్వహిస్తున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో నలుగురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ తెలిపారు.విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని జూదం ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ అయిన వారిలో వెంకటాపురం లక్ష్మణ్, జుకంటి లోకయ్య, మన్నె ప్రసాద్, యల్లయ్యగారి భూమ్ రెడ్డి ఉన్నారు. కాగా, రాకేష్ మరియు పెద్దొల్ల సుధాకర్ రెడ్డి పరారీలో ఉన్నారు.ఈ ఘటనలో సంఘటనా స్థలం నుంచి రూ.4,750 నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు చిల్పిచేడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.జిల్లాలో ఎక్కడైనా జూద కార్యకలాపాలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

