ఏ2టీవీ న్యూస్, మార్చి 22, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ పట్టణంలోని 12వ వార్డు పిల్లికోట్టల్ డబుల్ బెడ్రూమ్స్ కాలనీ సమస్యలకు నిలయంగా మారిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. అడివయ్య అన్నారు. సమస్యల పరిష్కారం కోసం మార్చి 24న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.సిపిఎం ప్రతినిధి బృందం కాలనీలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంది. నాలుగు ఏళ్ల క్రితం ఇండ్లు కేటాయించినప్పటికీ మౌళిక సదుపాయాలు కల్పించలేదని ఆరోపించారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మంచినీటి సరఫరా తక్కువగా ఉండటంతో పాటు బోర్ చెడిపోయి సంవత్సరం గడిచినా మరమ్మతులు చేయలేదన్నారు.ఇండ్ల నిర్మాణం నాసిరకంగా ఉండి వర్షాల సమయంలో నీళ్లు కారుతున్నాయని, ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ భద్రతా కంచెలు లేక ప్రమాదం ఉందని తెలిపారు. ఖాళీగా ఉన్న ఇండ్లను పేదలకు వెంటనే కేటాయించాలని, లేకపోతే ఆక్రమించుకుంటామని హెచ్చరించారు.కాలనీలో పార్కులు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని, అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.

