ఏ2టీవీ న్యూస్, మార్చి 22, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)


రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో విస్తృత అభివృద్ధి కార్యక్రమాలకు ఆదివారం శ్రీకారం చుట్టారు. రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన ఆయన, రూ.50 కోట్లతో నిర్మించనున్న రిఫైనరీకి శంకుస్థాపన చేశారు.అదేవిధంగా, మొత్తం రూ.475 కోట్ల 72 లక్షల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపనలు నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వహించిన రైతు మహోత్సవం బహిరంగ సభలో సుమారు 30 వేల మంది రైతులు పాల్గొన్నారు. సభలో రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,600 కోట్ల రైతు భరోసా నిధులను సీఎం విడుదల చేశారు.అనంతరం భారీ సభను ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి, కార్యక్రమం ముగిసిన తర్వాత హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు బయలుదేరారు.

