ఏ2టీవీ న్యూస్ మార్చి23, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

యాసంగి (రబీ) సీజన్ ధాన్యం కొనుగోలుకు ముందస్తు సన్నాహాలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో వ్యవసాయ, పౌర సరఫరా తదితర శాఖలతో ఆమె చర్చించారు. ఏప్రిల్ 15 నుంచి పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సీజన్‌లో 4.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.అదేవిధంగా వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో 31.7 లక్షల మొక్కలు నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని, నర్సరీల ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. బాల్యవివాహాల నిరోధం, చిన్నపిల్లల పౌష్టికాహారం, తక్కువ బరువు ఉన్న పిల్లల గుర్తింపు పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ప్రజావాణి దరఖాస్తులను శాశ్వతంగా పరిష్కరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్ సహా అధికారులు పాల్గొన్నారు.

