ఏ2టీవీ న్యూస్, మార్చి24, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్: ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ, పోలీసు అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు.ఈ సందర్భంగా మెదక్ పరిధిలోని పసుపులేరు వాగు వద్ద గంగమ్మ గుడి, ఎల్లమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న మార్గాలను అధికారులు గుర్తించారు. వెంటనే ఆ మార్గాన్ని జేసీబీ సహాయంతో త్రవ్వి మూసివేశారు.అలాగే అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 60 టన్నుల ఇసుకను గుర్తించి సీజ్ చేశారు. సీజ్ చేసిన ఇసుకను టిప్పర్ల ద్వారా మెదక్ సాండ్ బజార్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట వేయడానికి కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత రెవెన్యూ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

