Thursday, May 7, 2026

ప్రజావాణి దరఖాస్తులపై తక్షణ చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

ఏ2టీవీ న్యూస్, మార్చి 30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో ప్రజావాణిలో అందిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 81 దరఖాస్తులు స్వీకరించారు. ఈ దరఖాస్తులను సంబంధిత శాఖలకు ఎండార్స్మెంట్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పరిష్కారం వివరాలను దరఖాస్తుదారులకు తెలియజేయాలని సూచించారు. వచ్చే సోమవారం నాటికి అన్ని దరఖాస్తులు పూర్తిగా పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కార్యాలయానికి వస్తున్నందున వారి సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పర్యవేక్షణలో లోపాలు ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్‌డీఓ శ్రీనివాసరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular