Thursday, May 7, 2026

సమస్యలపై నిర్భయంగా ఫిర్యాదు చేయండి: అదనపు ఎస్పీ ఎస్. మహేందర్

ఏ2టీవీన్యూస్, మార్చి30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు జిల్లా ఎస్పీ ఎస్. మహేందర్ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు, వివాదాలు, పోలీసు సంబంధిత ఇబ్బందులను నేరుగా ఆయన దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా ప్రతి ఫిర్యాదుదారునితో అదనపు ఎస్పీ వ్యక్తిగతంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అందిన ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని కేసులపై ఎస్‌హెచ్‌ఓలతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు.అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ మాట్లాడుతూ, ప్రజలు ఎలాంటి భయం లేకుండా తమ సమస్యలను వెల్లడించాలని కోరారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఎటువంటి పైరవీలు అవసరం లేదని తెలిపారు. చట్టపరంగా ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు.ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఇప్పటికే అనేక సమస్యలు పరిష్కారమై, పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular