ఏ2టీవీ న్యూస్, మార్చి 31, శివంపేట్ ప్రతినిధి (రామకృష్ణ)

మెదక్ జిల్లా శివంపేట్ మండలం, కొత్తపేట గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.గ్రామ సర్పంచ్ రాములు, ఉప సర్పంచ్ శేఖర్ గౌడ్, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమి దానం చేసిన మాజీ వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి గారికి గ్రామ ప్రజలు మరియు పాలకవర్గ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలను గ్రామస్తులు అభినందించారు.

