Thursday, May 7, 2026

జంగారాయిలో ఎస్పీ పరామర్శ – 48 గంటల్లో దోపిడీ కేసు ఛేదన

ఏ2టీవీ న్యూస్, మార్చి 31, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లాలోని జంగారాయి గ్రామంలో వృద్ధ దంపతులపై జరిగిన దోపిడీ ఘటనను పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు బాధితులు సావిత్రి, అంజయ్యలను పరామర్శించి ధైర్యం చెప్పారు.కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని వేగంగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు.కేసు ఛేదనలో పోలీసుల పనితీరును గ్రామ ప్రజలు ప్రశంసిస్తూ ఎస్పీని శాలువాతో సన్మానించారు. గ్రామ ప్రజల సహకారంతోనే నిందితుడిని త్వరగా పట్టుకోవడం సాధ్యమైందని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్లూస్ అందించిన గ్రామస్థులను కూడా సన్మానించారు.ప్రజలు–పోలీసుల సమన్వయంతో నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని ఎస్పీ అన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు అవసరమని సూచిస్తూ, అనుమానితులపై అప్రమత్తంగా ఉండి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో తూప్రాన్ డియస్పి నరేందర్ గౌడ్, సిఐలు వెంకట రాజా గౌడ్, సందీప్ రెడ్డి, ఎస్ఐ నారాయణ, పోలీసు సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular