Thursday, May 7, 2026

99 రోజుల ప్రణాళికలో భాగంగా మెదక్ జిల్లాలో గ్రామసభలు ఘనంగా నిర్వహణ

ఏ2టీవిన్యూస్ ఏప్రిల్ 3, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ :(2) మెదక్ జిల్లా వ్యాప్తంగా 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రజా పాలన గ్రామసభలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో ప్రత్యేక అధికారి రషీద్ ఆధ్వర్యంలో, గ్రామ సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభలు, తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వ గ్రామీణ పథకాల ప్రాముఖ్యత మరియు పథక లబ్ధిదారుల పేర్లు గ్రామ సభలో తెలుపుట గురించి గ్రామ సభ సజావుగా కొనసాగింది. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. గ్రామస్థుల సమస్యలు, అవసరాలు, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చలు నిర్వహించగా, ప్రజల అభిప్రాయాలను అధికారులు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామ అభివృద్ధి పనుల పురోగతిపై గ్రామసభలో సమగ్రంగా విశ్లేషణ జరిగింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రజల సహకారం ఉంటేనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గ్రామస్థులు చురుకుగా పాల్గొని తమ సమస్యలను వెల్లడించడంతో పాటు, పరిష్కారాలపై విలువైన సూచనలు అందించారు.గ్రామసభలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేశారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి రషీద్, పంచాయతీ సెక్రెటరీ సబిత, గ్రామ సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ మద్దూర్ రాజు, వార్డు సభ్యులు మంగలి లక్ష్మణ్, బండ్ల వేణు, తోయేటి రాధాకృష్ణ, గొర్రె శ్రీహరి, అబ్రమైన యశోద, కొమ్ము కవిత, గొర్రె ఎల్లవ్వ, ప్రజా ప్రతినిధులు, మహిళ సంఘాలు, యువజన సంఘాలు, గ్రామ పెద్దలతో పాటు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular