Thursday, May 7, 2026

నెలవారీ తనిఖీ… ఈవీఎం గోదాం పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 4 మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో నిర్వహిస్తున్న నెలవారీ తనిఖీల కార్యక్రమంలో భాగంగా, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ శనివారం (ఈవీఎం) గోదాంను పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.గోదాంలో భద్రపరచిన ఈవీఎంల భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, అగ్ని ప్రమాద నివారణ చర్యలు, డబుల్ లాక్ సిస్టమ్ వంటి అంశాలను కలెక్టర్ సవివరంగా పరిశీలించారు. గోదాం వద్ద విధులు నిర్వర్తిస్తున్న భద్రతా సిబ్బంది పనితీరును కూడా సమీక్షించారు.ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడటానికి ఈవీఎంల భద్రత అత్యంత కీలకమని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. గోదాంలో అమలు చేస్తున్న భద్రతా ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు.ఈ తనిఖీలో పాల్గొన్న రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా గోదాంలో అమలు చేస్తున్న భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, సంబంధిత విభాగాల అధికారులు, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular