ఏ2టీవీన్యూస్, ఏప్రిల్ 4, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రామ్ చందర్)
ఈనెల 5న డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి తెలిపారు. వెల్దుర్తి రోడ్ లోని సాయి కృష్ణ ఫంక్షన్ హాల్ లో ఈ జాబ్ మేళా ఉంటుందని, సుమారు 25 ఆయా కంపెనీలు పాల్గొని 1000 ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పదవ తరగతి నుండి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ తదితర విద్యను అభ్యసించిన విద్యార్థులు తమ బయోడేటా తో సర్టిఫికెట్లతో ఈ జాబ్ మేళాకు హాజరుకావాలని సూచించారు. ఇట్టి అవకాశాన్ని నర్సాపూర్ నియోజకవర్గ నిరుద్యోగ యువతి,యువకులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.

