ఏ2టీవి న్యూస్, ఏప్రిల్ 6, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా(5) చేగుంట మండలం పులిమామిడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధాని, బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, సామాజిక సమానత్వం కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామ అభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొని జగ్జీవన్ రామ్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.

