Thursday, May 7, 2026

ఆరోగ్యకరమైన జీవనానికి “ఈట్ రైట్ – వాక్”జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపు

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 6, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

సరైన ఆహారం – ఆరోగ్య భవిష్యత్తు” వంటి నినాదాలతో ప్లేకార్డులు పట్టుకుని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ కొనసాగింది. రాందాస్ చౌరస్తాలో నిర్వహించిన సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ హెల్త్ వీక్ కార్యక్రమంపై వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు నుండి వారం రోజులపాటు హెల్త్ వీక్ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం” అని తెలిపారు. శారీరక ఆరోగ్యం కోసం సమతుల్య ఆహారం తీసుకోవడం అవసరమని, ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండి పండ్లు, కూరగాయలు, ధాన్యాలు వంటి సహజ ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.“ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యానికి మించిన సంపద లేదు” అని పేర్కొన్నారు. ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని, కార్బోహైడ్రేట్స్‌ను పరిమితంగా తీసుకోవాలని సూచించారు. శరీరానికి ఆహారం ఎంత అవసరమో వ్యాయామం కూడా అంతే అవసరమని చెప్పారు. హెల్త్ వీక్ సందర్భంగా: ఏప్రిల్ 7: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ వర్కర్లకు సత్కారం ఏప్రిల్ 8: రక్షిత మాతృత్వ దినోత్సవం – సురక్షిత ప్రసవాలపై అవగాహన ఏప్రిల్ 9: ఎయిడ్స్ నియంత్రణపై “రెడ్ రన్” కార్యక్రమం ఏప్రిల్ 10: హోమియోపతి, ఆయుష్ దినోత్సవం – యోగా, ఆరోగ్య శిబిరాలు ఏప్రిల్ 11: మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన, విద్యార్థులకు పోటీలు ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది అందరికీ కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీరామ్, డీసీహెచ్ డాక్టర్ శివదయాల్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఎఫ్ఓ, డీఈఓ విజయ, బీవో హేమభార్గవి, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు, పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, క్రీడాశాఖ అధికారి రమేష్, మత్స్యశాఖ అధికారులు, మున్సిపాలిటీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular