ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 6, నర్సాపూర్ ప్రతినిధి (రామ్ చందర్)
డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు గుర్తించి వెంటనే పంపిణీ చేయాలని జనసేన పార్టీ నాయకులు సోమవారం మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్‌ను కలిసి విన్నవించారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ నర్సాపూర్ డివిజన్ నాయకుడు శాఖమూరి యాదగిరి మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇప్పటివరకు లబ్ధిదారులకు అందజేయలేదని పేర్కొన్నారు. అవి ఖాళీగా ఉండడం వల్ల శిథిలావస్థకు చేరుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.పట్టణంలోని అర్హులైన పేదలను గుర్తించి, ఆ ఇండ్లను తక్షణమే పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

