Thursday, May 7, 2026

ఏఐపై కట్టడి అవసరం…!

ఏ2టీవీన్యూస్, ఏప్రిల్ 7, బ్యూరో(మల్పర్తిరాంచందర్)

ప్రస్తుతం ఏ ఐ పై కట్టడి అవసరమా అంటే అవసరమనే చెప్పాలి. ఎందుకంటే దీనివల్ల ప్రజలకు, తయారీదారులకు ప్రయోజనం ఎంతవరకో తెలియదు కానీ అనైతిక కార్యక్రమాలకు ముఖ్యమైన ప్లాట్ఫారం గా మారి ప్రజల మనోభావాలతో ఆటలాడే పరిస్థితి తలెత్తింది. అసలు ఈ ఏఐ అంటే ఒక సాఫ్ట్వేర్ దీని ద్వారా పాత ఫోటోలను మనం కూడా సంబ్రమాశ్చర్యాలకు గురయ్యేలా కొత్తదిగా మార్చడం దీనికి ఉన్న ప్రత్యేకత. అంతేకాదు మరోవైపు అనైతిక కార్యక్రమాలకు పాల్పడడం కూడా దీనివల్ల, దీని ఆధారిత మరో ఇతర సాఫ్ట్వేర్ల వల్ల కూడా అవుతుంది. దీనిని ఆసరాగా తీసుకున్న కొందరు ఇప్పటికే మహిళల చిత్రాలను వివస్త్రగా చేసి అట్టి ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతుంటారు. వాట్సాప్ లో గాని మరే ఇతర సోషల్ మీడియాలో కానీ ఒక ఫోటో తీసుకొని ఆ ఫోటోకు రూపం ఇచ్చి నగ్నంగా తయారు చేయడం ఇలాంటి సాఫ్ట్వేర్లతో చాలా సులువు. కానీ ఆ మహిళల మనోభావాలు దెబ్బతిని వాళ్ళ కుటుంబ పరువు రోడ్డున పడితే అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యులు. ఇలాంటి పైశాచికత్వం ఎందుకు దేనికోసం ? మామూలు వాళ్లే కాకుండా సినిమా హీరోయిన్ ల సైతం ఫోటోలు ఈ సాఫ్ట్వేర్ తో వివస్త్రగా చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. రెగ్యులర్గా సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి ఇది సుపరిచితమే. ఇందులో మన ఫోటో కూడా ఏఐ సాయంతో క్లియర్ చేసుకుంటే అసలు ఏదో నకిలీ ఏదో గుర్తుపట్టలేనంత విధంగా ఉండటం ఇలాంటి సాఫ్ట్వేర్లకు ఉన్న ప్రత్యేకత. దీనిని మంచికి ఉపయోగిస్తే పరవాలేదు కానీ ఇలాంటి అనైతిక కార్యకలాపాలకు వినియోగిస్తే మాత్రం మహిళల మనోభావాలు దెబ్బ తినడం తద్వారా వాళ్ళ కుటుంబాలు కుటుంబ పరువు బజార్లో పడటం ఇలాంటి అనేక దుస్సంఘటనలు జరుగుతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కొత్త కొత్త సాఫ్ట్వేర్ల పుణ్యమా అని మహిళల ఫోటోలను కృత్రిమ మేధా సాయంతో వివస్త్రగా చేసి సోషల్ మీడియాలో పెడితే కొన్ని లక్షల సార్లు షేర్ చేసినట్లు డేటా చూస్తే తెలుస్తుందని సాఫ్ట్వేర్ డెవలపర్లు, ఇంటర్నెట్ ఆధారిత సంస్థలు పేర్కొంటున్నాయి. ఇలాంటి సాంకేతికతను సాఫ్ట్వేర్లు డెవలప్ చేస్తున్నట్లయితే వారు నేరం చేస్తున్నట్లే లెక్క. దీన్ని అడ్డుకోవడానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్ ని కూడా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమ్మతి లేకుండా మహిళల ఫోటోలను అసభ్యకర రీతిలో పెట్టడం రివెంజ్ పోర్న్ గా వ్యవహరిస్తారు. ఇది ప్రజల జీవితాలపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే చిన్నపిల్లలు, యువకులు అనే తేడా లేకుండా అందరూ మొబైల్ కు బానిసలు అయ్యారు కాబట్టి విపరీతమైన దుష్పరిణామాలు చూపుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆన్లైన్లో మహిళల ఫోటోలను అసభ్యకర రీతిలో పెట్టడం తీవ్ర నేరంగా పరిగణించాలి. డిజిటల్ పద్ధతుల్లో మహిళల నగ్న చిత్రాలను రూపొందించడం సోషల్ మాధ్యమాల్లో పెట్టడం ఇవి ఇంకా పూర్తిస్థాయి చట్టపరిధిలోకి రావట్లేదు కాబట్టి ఇలాంటివి జీవితాలపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి వీటిని కూడా లైంగిక నేరంగా పరిగణించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదంటే ముందు ముందు ఇంకెన్ని దుష్పరిణామాలు ఉంటాయో! మామూలు సాఫ్ట్వేర్లతోనే ఫోటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేయగా కొందరు మహిళలు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. కొన్ని కుటుంబాల పరువు బజార్లో పడ్డ సంఘటనలు ఉన్నాయి. ఇక ఇలాంటి అధునాతన సాఫ్ట్వేర్ల సహాయంతో కేటుగాళ్లు ఇలా రెచ్చిపోతే ఇక వేరే చెప్పాల్సిన పనిలేదు కాబట్టి దీన్ని కూడా లైంగిక నేరంగా పరిగణించాల్సిందే. మామూలు మహిళలు మొదలుకొని సెలబ్రిటీల వరకు ఎవరి ఫోటోలు కూడా ఈ సాఫ్ట్వేర్ బారిన పడకుండా చూసి అలా ఎవరైనా పాల్పడితే వారిని కఠినంగా శిక్షించి ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలి. అటు ప్రభుత్వం కూడా పూర్తిస్థాయి దృష్టి సారించి కట్టుదిట్టం చేసి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇలాంటి సాఫ్ట్వేర్లను బ్యాన్ చేసి ఇకముందు కూడా రాకుండా చూడాలి. సైబర్ క్రైమ్ కూడా డేగకన్ను వేసి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తే ఇలాంటి వికృత చేష్టలు కట్టడి కావు అని పలువురుఅభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular