Thursday, May 7, 2026

ఎయిడ్స్‌పై అవగాహనతోనే నివారణ సాధ్యం: కలెక్టర్ ప్రతిమా సింగ్

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 9, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో ఎయిడ్స్ (HIV/AIDS) వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ద్వారానే సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు.గురువారం 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల్లో నాలుగో రోజు ఎయిడ్స్ అవగాహన, నివారణ దినోత్సవం సందర్భంగా “రెడ్ రన్” వాకథాన్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ప్రతిమా సింగ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, డీసీఎచ్ఎస్ శివ దయాల్, నర్సింగ్ కళాశాల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రామ్‌దాస్ చౌరస్తా వరకు నిర్వహించిన ఈ వాకథాన్‌లో ఎయిడ్స్ నివారణపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిడ్స్ పూర్తిగా నయం కాని వ్యాధి అయినప్పటికీ, సరైన జాగ్రత్తలు పాటించడం ద్వారా దీని వ్యాప్తిని నియంత్రించవచ్చన్నారు. అసురక్షిత లైంగిక సంబంధాలు, సంక్రమిత రక్త మార్పిడి, వాడిన సిరంజీల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని తెలిపారు. అందువల్ల ప్రజలు సురక్షిత పద్ధతులను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.జిల్లాలో ప్రస్తుతం 385 హెచ్‌ఐవీ/ఎయిడ్స్ బాధితులకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని ఏఆర్టీ కేంద్రంలో చికిత్స అందిస్తున్నామని, బాధితులు ఎటువంటి భయం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించాలని కలెక్టర్ తెలిపారు.రామ్‌దాస్ చౌరస్తాలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ, ప్రజలు భయాందోళనలకు గురికాకుండా హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పాజిటివ్‌గా తేలితే తగిన జాగ్రత్తలు పాటిస్తూ చికిత్స పొందాలని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పల్లెల్లో, పట్టణాల్లో కళాజాతలు, ప్రచార కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.ర్యాలీలో వైద్య అధికారులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్లకార్డులు ప్రదర్శిస్తూ “ఎయిడ్స్ నివారణ” నినాదాలతో ప్రజలకు సందేశం అందించారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ సిబ్బంది, ఎన్జీఓ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular