ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 11,మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సెక్రెటరీ, కేశవ అసోసియేషన్ అధ్యక్షుడు శివ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై పూలేకు ఘన నివాళులర్పించారు.జయంతి సందర్భంగా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద పూలే విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, ఆయన సమాజ సేవలను స్మరించుకున్నారు. సమానత్వం, విద్యా విస్తరణ కోసం పూలే చేసిన కృషి చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ శివ గౌడ్, మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు చిన్నలింగ్ మల్లికార్జున్ గౌడ్, జిల్లా జనరల్ సెక్రెటరీ హిమాపురం వెంకటేష్ గౌడ్, మనరాబాద్ మండల అధ్యక్షుడు లాలేష్ గౌడ్, తూప్రాన్ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు గజ్జల కృష్ణతో పాటు పర్సా సాయికుమార్, శ్రీకాంత్, బాయికాడ ముత్యాలు, గౌటి బాలేష్, స్వర్గాల నాగులు, ఎం. రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

