Thursday, May 7, 2026

నర్సాపూర్ లోప్రజాపాలన ప్రగతి ప్రణాళికవార్డు సభ

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 13 నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి(బుచ్చన్న)

నర్సాపూర్ పట్టణంలో నిర్వహించిన ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక వార్డు సభలో మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్ , ఎస్‌ఐ రంజిత్ కుమార్ , ఎం.ఆర్.ఓ శ్రీనివాస్ మరియు కౌన్సిలర్లు పాల్గొన్నారుఈ సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు తెలిపారు. అలాగే యువత ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిస కాకుండా తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించి, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించారు. సజీవంగా చేరుకోండి అనే సందేశంతో ప్రజల్లో అవగాహన పెంపొందించారు. ప్రజలు చట్టాలను పాటిస్తూ సురక్షితమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.ట్రాఫిక్ నియమాలు పాటించండి – సురక్షితంగా చేరండినెమ్మదిగా నడపండి – ఇంటికి సురక్షితంగా చేరండి మొబైల్ కాదు – మీ లక్ష్యం ముఖ్యం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular