ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 13,చిన్నశంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)
ప్రభుత్వం రైతులకు ధాన్యానికి గిట్టుబాటు కల్పించాలని పీఏసీఎస్ ఆధ్వర్యంలో జంగరాయి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా తాసిల్దార్ మాలతీ, సర్పంచ్ ఆవుల గోపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఎండలు తీవ్రంగా ఉన్నందున రైతులకు ధాన్యం కొనుగోలు కోసం ఇచ్చిన టోకెన్ల ద్వారానే గ్రామబద్దీకరణలో ధాన్యాన్ని సేకరించాలని అన్నారు ప్రభుత్వం రైతుల పండించిన రైతులకు ఏ గ్రేడ్ రకానికి రూ 2389, బి రకానికి రూ. 2369 మద్దతు ఇస్తుంద ని తెలిపారు. సన్న రకం ధాన్యానికి అదనంగా 500 బోనస్ ఇస్తుంది అని తెలిపారు. దళాలకు ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దని ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఆవుల గోపాల్ రెడ్డి, సొసైటీ చైర్మన్ బాలకృష్ణయ్య, గడ్డం సురేష్, తోపాటు తదితరులు పాల్గొన్నారు.

