ఏ2టీవీ న్యూస్,ఏప్రిల్ 13, నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి (బుచ్చన్న)
సోమవారం తెలంగాణ ప్రభుత్వం సూచన ప్రకారం తుక్కాపూర్ లో సర్పంచ్ దొడ్లే ఆంజనేయులు అధ్యక్షతన రోడ్డు భద్రత నియామవలి లో భాగంగా తుక్కాపూర్ లో వాహన దారులకు ప్రజలకు సూచనలు చేస్తున్న విలేజ్ పోలీస్ ఆఫీసర్ మహేష్ వాహనాల నడిపే వారికి పలు సూచనలు చేశారు. అందులో భాగంగా ప్రతి వాహనదారుడు వాహనం నడిపేటప్పుడు తమ ప్రాణాల రక్షణకై హెల్మెట్ ధరించడం అత్యంత ముఖ్యమని ఆయన తెలిపారు. అంతేగాకుండా చిన్నపిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇచ్చి తల్లిదండ్రులు తప్పులు చేయరాదని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టరీత్యా చర్యలు చేపడతామణి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం రోడ్డు భద్రత ప్రజలతో ప్రమాణం చేయడం జరిగింది,,, ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ ఉప సర్పంచ్, అంగన్వాడి,ఆశా వర్కర్, ఫీల్డ్ అసిస్టెంట్,డీలర్,మరియు గ్రామ పెద్దలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

