Thursday, May 7, 2026

నో హెల్మెట్ – నో ఎంట్రీ: నందగోకుల్ గ్రామంలో వినూత్న కార్యక్రమం

జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచన – అన్ని గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలి

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 13, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాలోని 492 గ్రామపంచాయతీలలో ‘అరైవ్ అలైవ్’ గ్రామ సభలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజాంపేట్ మండలం నందగోకుల్ గ్రామంలో గ్రామ సభ సందర్భంగా గ్రామస్తులు వినూత్నంగా “నో హెల్మెట్ – నో ఎంట్రీ” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి గ్రామస్తులు పూలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం హెల్మెట్లు ధరించి ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల ప్రాణ రక్షణ కోసం నందగోకుల్ గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అన్నారు. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలు ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని “నో హెల్మెట్ – నో ఎంట్రీ” కార్యక్రమాన్ని అమలు చేయాలని సూచించారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రతి వ్యక్తి సురక్షితంగా తిరిగి ఇంటికి చేరుకోవాలంటే రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం వంటి కారణాల వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ఉపయోగించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని హెచ్చరించారు.జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 1.7 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తుంటే, తెలంగాణలోనే సుమారు 7,000 మంది మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో ఇతర నేరాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. రోడ్డు భద్రత నియమాలు పాటించకపోవడం ప్రధాన కారణమని తెలిపారు.ప్రతి ఒక్కరూ నందగోకుల్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని హెల్మెట్ వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో భాగంగా ఒక కానిస్టేబుల్ మిమిక్రీ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి దేవకుమార్, సర్పంచ్ భాను, ఎంపీడీవో రాజిరెడ్డి, సీఐ వెంకటరాజా గౌడ్, డీఎస్పీ నరేందర్ గౌడ్, పోలీసు సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular