ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 14 మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

చేగుంట(13) ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 492 గ్రామపంచాయతీలలో నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్’ గ్రామ సభలలో భాగంగా పులిమామిడి గ్రామంలో ప్రత్యేక రోడ్డు సేఫ్టీ గ్రామ సభ ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల హెడ్‌మాస్టర్ రషీద్, పంచాయతీ కార్యదర్శి సబిత, ఆశా వర్కర్లు, అంగన్వాడి టీచర్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ— మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరం అని మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు గ్రామస్థులు ఈ కార్యక్రమానికి హాజరై రోడ్డు భద్రతపై కీలక సూచనలు తెలుసుకున్నారు.

