ఏ2టీవీన్యూస్, ఏప్రిల్ 14, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్)
మెదక్ జిల్లా డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు శాఖమూరి యాదగిరి ఇతర నాయకులు కలిసి స్థానిక చిల్డ్రన్ పార్కులో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని సమ సమాజ స్థాపనకు కృషి చేయాలని అన్నారు. రాజ్యాంగాన్ని విద్యార్థులకు ప్రత్యేక సబ్జెక్టుగా చేర్చాలని, రెండు తెలుగు రాష్ట్రాలు భారత రాజ్యాంగాన్ని విద్యార్థులకు ఉచితంగా అందజేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

