Thursday, May 7, 2026

మనోహరాబాద్‌లో ఘనంగా డాక్టర్‌ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 14, మనోహరాబాద్ ప్రతినిధి (రామకృష్ణ)

మనోహరాబాద్ మండల వ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో దళిత సంఘాలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.మండలంలోని మనోహరాబాద్, కొండాపూర్, జీడిపల్లి, ముప్పిరెడ్డిపల్లి, గౌతోజీగూడా తదితర గ్రామాల్లో వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. నీలి జెండాలతో గ్రామాలు కళకళలాడగా, అంబేద్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేసి ఘనంగా స్మరించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, “భారత రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. విద్య ద్వారా ఉన్నత స్థానాలకు ఎదిగి సమాజ అభివృద్ధికి తోడ్పడాలి” అని పేర్కొన్నారు.కార్యక్రమాల్లో మండల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, దళిత సంఘాల నేతలు, యువత పాల్గొన్నారు. పూలమాలలు వేసి నివాళులర్పించడం, మిఠాయిల పంపిణీ, అంబేద్కర్ జీవితం గురించి చర్చించడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.మండల వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు పండుగ వాతావరణంలో ఎలాంటి లోటు లేకుండా విజయవంతంగా ముగిశాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular