– భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన యువత
– పాల్గొన్న సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి


ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్135వ జయంతి వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. నివాళులర్పించిన సర్పంచ్ మరియు గ్రామస్తులు గ్రామ సర్పంచ్ రావి పల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ యూత్ మరియు గ్రామ యువత కలిసి గ్రామంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జై భీమ్ నినాదాలతో పులిమామిడి పురవీధులు మారుమోగాయి.ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా, సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషి వెలకట్టలేనిదని కొనియాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్లనే నేడు అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతోందని, ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ వేడుకల్లో గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, అంబేద్కర్ యూత్ సభ్యులు,మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

