Thursday, May 7, 2026

మానవ తప్పిదాలే… మరణాలు

–యువత తలుచుకుంటే సాధించేది లేదు

–అంబేద్కర్ సమావేశంలో పాల్గొన్న డీఎస్పీ నరేందర్ గౌడ్.

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 15, చిన్నశంకరంపేట (ప్రతినిధి కమ్మరి దేవరాజు)

ప్రపంచాన్ని కదిలించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ అన్నారు.135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళవారం చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని రాత్రి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించిన అనంతరం అక్కడే అంబేద్కర్ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు గుత్తి గళ్ళ రామచంద్రం డీఎస్పీ నరేందర్ గౌడ్,ఎస్సై నారాయణ గౌడ్ పాల్గొన్నారు. సమావేశంలో వారు మాట్లాడారు. భారతదేశంలో స్వేచ్ఛగా బతుకుతున్నామంటే అంబేద్కర్ అడుగడుగునా అవమానాలకు గురైనప్పటికీ ఆయన రచించిన రాజ్యాంగం వలనే ఈరోజు భారతదేశంలోని ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నట్లు తెలిపారు. సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్, ఎస్సై నారాయణ గౌడ్ మాట్లాడుతూ యువకులు ప్రతి ఒక్కరు చదువుకోవాలని సూచించారు. రోడ్డు పద్ధతి నియమాలు పాటించాలని, డగ్స్, గంజాయి, మత్తు పదార్థాలు యువత దూరం ఉండాలని, ప్రతి ఒక్కరు చదువుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మురళి మాదిగ, దళిత సంఘాల నాయకులు తదిత నాయకులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular