ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 15, నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి (బుచ్చన్న)
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని పేట గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఆరైవ్ అలైవ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు ఆధ్వర్యంలో గ్రామ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు పలువురు నాయకులు , ప్రజలు పాల్గొనగా పోలీస్ సిబ్బంది రోడ్డు ప్రమాదాలపై అవగాహనలో భాగంగా గ్రామంలోని ప్రతి ఒక్కరు వాహనాలు చిన్నపిల్లలకు ఇవ్వకూడదని అలాగే అతివేగం గా వెళ్ళరాదని ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించడం అత్యంత ముఖ్యమైన విషయమని ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు కలిగే విజయ్ నీలకంఠ ప్రసాద్ ఉషికే సుధాకర్ ఫీల్డ్ అసిస్టెంట్ అంగన్వాడి కార్యకర్తలు అల్లూరు ప్రభుత్వ సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు.

