ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 15,చిన్నశంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)
వాహనాల నడిపే సమయంలో హెల్మెట్ ధరించండి,మద్యం సేవించి వాహనాలు నడపకండి,రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు మీకేమైనా జరిగితే మీ కుటుంబం రోడ్డున పడుతుంది,మా వయసులో ఉన్న మీ పిల్లలు అనాథలుగా మారుతారు అంటూ, రోడ్డు సేఫ్టీ నియమాలపై ప్రయాణికులకుబుధవారం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద విద్యార్థులకు వాహనదాలకు ఎస్సై నారాయణగౌడ్అవగాహణ కల్పించారు. విద్యార్థులు. పాఠశాల విద్యార్థులచే వాహన దారులు రోడ్డు పైన ప్రయాణించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి తెలిపారు. జాతీయ ప్రధాన రహదారిపై హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలను నడిపే వారిని, సీట్ బెల్ట్ లేకుండా కార్లు,పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించుకునే ఆటోలను ఆపి రోడ్డు భద్రత నియమాలు పాటించాలని విద్యార్థులు చేసే సూచనలు పలువురిని ఆకర్షించింది. వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

