
ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 15, చిన్నశంకరంపేట:- ప్రతినిధి (కమ్మరి దేవరాజు)
అన్నలు తండ్రులు ఏ పని మీద అయినా, ఎక్కడికి పోయినా,హెల్మెట్ , సీట్ బెల్టు..తప్పనిసరిగా పెట్టుకొని పోవాలని బుధవారం చిన్నశంకరం పేట మండలంలోని చందాపూర్ పాఠశాలలోని విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి రోడ్డుపై వెళ్లే వాహనదారులను ఆపీ ప్లే కార్డులు తీసుకుని రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు రోడ్డు సేఫ్టీ నియమాలు తెలిపారు. వాహనాల నడిపే సమయంలో హెల్మెట్ ధరించండి మద్యం సేవించి వాహనాలు నడపకండి రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాస్తు మీకు ఏమైనా జరిగితే మీ కుటుంబం రోడ్డున పడుతుంది వయసులో ఉన్న మీ పిల్లలు అనాధలుగా మారతారంటూ, రోడ్డు సేఫ్టీ నియమాలపై వాహనదారులకు సూచించారు. వాహనాలపై పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించుకునే ఆటోలను ఆపి రోడ్డు పద్ధతి నియమాలు పాటించాలని చిన్నారి విద్యార్థులు సూచించడం పట్ల గ్రామ సర్పంచ్ చెన్నాగౌని కృష్ణ గౌడ్, ప్రధానోపాధ్యాయుడు మెతుకు పరమేశ్వర్ రెడ్డి, తోటవ్వ విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు చేసే సూచనలు పలువులని ఆకర్షించింది. రోడ్డు భద్రత నియమాలు ప్రతి గ్రామంలో రోడ్లపై వాహనదారులకు పోలీసులు అవగాహన కల్పిస్తే చందాపూర్ గ్రామంలో విద్యార్థులు ప్లే కార్డులతో వాహనదారులకు అవగాహన కలిగించడం పట్ల ప్రజా ప్రతినిధులు పలువురు పెద్దలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

